6 June, 2026 | 1:41 AM

ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని ప్రభుత్వం

06-06-2026 12:23 AM

రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన నేత కమ్మరి శ్రీనివాస్ విమర్శలు

గజ్వేల్, జూన్ 5 : ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్య్పా ఆరోపణలు చేయడం దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని జనసేన రాష్ట్ర నాయ కుడు కమ్మరి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం గజ్వేల్లోని జనసేన పార్టీ కార్యాల యంలో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు.

రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కళ్యాణలక్ష్మి, తులం బంగారం హామీతో పాటు ఆసరా పెన్షన్లు, రైతు బీమా, రైతు బంధు వంటి కీలక సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పవన్ కళ్య్పా చేస్తున్న విమర్శలను ఖండిస్తూ, తెలంగాణలో కూడా జనసేన సిద్ధాంతాలను విశ్వసించే లక్షలాది మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యమని, సిద్దిపేట జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు రైతు సమస్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.