calender_icon.png 7 June, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

05-06-2025 08:35:07 PM

పాల్గొన్న గ్రీన్ భద్రాద్రి సభ్యులు, ఫారెస్ట్ శాఖ ఉద్యోగులు..

భద్రాచలం (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణంలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) పురస్కరించుకొని అటవీ శాఖ గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అటవీ శాఖ కార్యాలయం నుండి భద్రాద్రి ప్రధాన వీధుల గుండా గోదావరి నది తీరంలో గల కరకట్ట వద్దకు ర్యాలీ నిర్వహించి అక్కడ పెద్ద ఎత్తున అటవీ శాఖ ఉద్యోగులు గ్రీన్ భద్రాద్రి సభ్యులు చెట్లను నాటారు. 

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... పర్యావరణ సమతుల్యం పాటించడానికి విరివిగా చెట్లు నాటాలని, పచ్చదనాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు నో ప్లాస్టిక్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు సుజాత రంజిత కమల దాల్మియాతో పాటు గ్రీన్ భద్రాద్రి నాయకులు యోగి సూర్యనారాయణ శివ శంకర్ నాయుడు బోనాల సూర్యనారాయణ తో పాటు పలువురు పాల్గొన్నారు.