16 April, 2026 | 9:24 AM

నేర నిరూపణలో సీసీ కెమెరాలు కీలకం..

05-06-2025 08:32 PM

ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం..

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో సీసీ కెమెరాలపై కల్పించిన అవగాహనాతో కాలనీ వాసులు, వ్యాపార సంస్థల యాజమాన్యం సహకారంతో 14 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గురువారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్(ACP Ravikumar), కాలనీ వాసులతో కలిసి కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీసీ రవికుమార్ మాట్లాడారు. సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అన్నారు. సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని స్పష్టం చేశారు. ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయన్నారు.

సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపారు. కేసుల ట్రయల్ సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు. సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయన్నారు.  పోలీస్ స్టేషన్  పరిధిలోని సీసీ కెమెరాలు లేని కాలనీలు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. 

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటు కు కృషి చేసిన స్థానిక ప్రజాప్రతినిధులను, కాలనీ వాసులను ఏసీసీ,సిఐ ఆఫ్జలుద్దిన్, స్థానిక ఎస్సైతో కలిసిసన్మానించారు. మిగిలిన కాలనీ వాసులకు ఆదర్శంగా నిలిచినందుకువారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్జలుద్దిన్, ఎస్సై మహేందర్ పోలీస్ సిబ్బంది, కాల్ టెక్స్ ఏరియా ప్రజలు పాల్గొన్నారు.