13 March, 2026 | 11:26 AM

సింగరేణి ఆసుపత్రిలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం

13-03-2026 12:00 AM

కొత్తగూడెం మార్చి 12 (విజయక్రాంతి): కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు గురువారం నాడు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాe ఆర్.కిరణ్ రాజకుమార్  ఆదేశాల మేరకు గురువారం రోజున ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా, మూత్ర పిండాల వ్యాధులు,నివారణ చర్యలపై  అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ  సంధర్భముగా డివైసిఎంఓ  కే.ఎస్.విశ్వమేధి, హెల్త్ డాక్టర్ డి. లలిత, మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం, మార్చి నెలలోని రెండో గురువారం నాడు అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని,

2006లో ప్రారంభమైన ఈ ఉద్యమం, 2026 నాటికి రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంటోంది అని, ‘అందరికీ మూత్రపిండాల ఆరోగ్యం  ప్రజల సంరక్షణ, భూమి రక్షణ‘ అనే నినాధం తో ఈ ఏడాది అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం అని తెలిపారు.  కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పెంచడం, నివారణాలను అందరికీ తెలియజేయటం

ఈ కిడ్నీ డే యొక్క ముఖ్య ఉద్దేశం అని, మధుమేహం,  అధిక రక్త పోటు మరియు నొప్పి మాత్రలు ఎక్కువగా వేసుకోవటం ద్వారా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వస్తాయని, కిడ్నీ వ్యాధిని ‘నిశ్శబ్ద వ్యాధి‘ అని పిలుస్తారు కిడ్నీ వ్యాధుల నివారణ కొరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, బిపి, షుగర్ ను నియంత్రణ లో ఉంచుకుంటూ, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకొని కిడ్నీలను కాపాడుకోవాలని వివరించారు.  సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు కిడ్నీ వ్యాదిన పడిన వారికి ప్రత్యేక డయాలసిస్ వార్డు ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.   ఈ కార్యక్రమం లో డివైసిఎంఓ  కే.ఎస్.విశ్వమేధి,  హెల్త్ డాక్టర్ డి. లలిత, మెయిన్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.