12 May, 2026 | 11:29 AM

Breaking News

సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •  

నవ్వుతూ బతుకుదాం!

05-05-2024 12:40 AM

నేటి ఆధునిక యాంత్రిక వేగవంతమై న జీవన విధానంలో సంతృప్తిగా నవ్వగలిగే సందర్భాలు చాలా అరుదుగా కనిపి స్తున్నాయి. మనస్ఫూర్తిగా నవ్వటంతో పలు శారీరక మానసిక అస్వస్థతలకు ఉపశమనం సిద్ధిస్తుందని నమ్మిన పలు జన సమూహాలు నవ్వుల క్లబ్‌లను నెలకొల్పి ‘లాఫింగ్ యోగా’ సాధన, ‘లాఫర్ థెరపీ’ చేస్తున్నారు. మనస్ఫూర్తిగా నవ్వగలగడం ఓ మంచి అమూల్య వరం. మానవాళి సమగ్ర శ్రేయస్సుకు, క్షేమానికి నవ్వులు ఉచిత దివ్యౌషధాలుగా పని చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా నవ్వుల ప్రాధాన్యాన్ని గుర్తించిన సమాజం ప్రతి ఏటా మే తొలి ఆదివారం (5) ‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. 

నవ్వుల యోగా ఉద్యమం

10 జనవరి 1998 రోజున ముంబా యి నగరంలో డా॥ మదన్ కటారియా చొరవతో ‘నవ్వుల యోగా ఉద్యమం’ ప్రారంభించారు. దైనందిన జీవితంలో నవ్వడానికి కారణాలను వెదకాలే కాని, బాధలను వెతికి వెతికి మోయడం సరి కాదు. ప్రతికూల సమస్యల సాధన సమయంలో నవ్వులను ఆశ్రయించడం ఉత్త మంగా పాటించాలి. మానసిక ఒత్తిడిని మాయం చేయగల మహత్తర శక్తి నవ్వులకు ఉంటుంది. పట్టణాల్లోని పార్కుల్లో ప్రతిరోజు ఉదయం వ్యాయామ సమయంలో ‘లాఫింగ్ క్లబ్’ల ద్వారా జోక్స్ చెప్పుకుంటూ మనసారా నవ్వుకోవడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు ఖండాల్లో 6,000లకు పైగా లాఫింగ్ క్లబ్బులు నెలకొని ఉన్నాయి. నవ్వడం వల్ల అనేక అనారోగ్యాలు మాయమవుతాయనే ప్రచారంతో ‘లాఫర్ థెరపీ’ కూడా బహుళ ప్రచారం పొందింది. ‘వరల్డ్ లాఫ డే’ సందర్భంగా నవ్వుల ప్రాధాన్యాలను తెలిపే ప్రసంగాలు, జోక్స్ చెప్పి నవ్వించడం, శాంతి ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, పలు ఆసక్తికర హాస్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

ఓ దివ్య ఔషధం

‘నవ్వు ఓ అద్భుత ఉచిత దివ్య ఔష ధం’. నవ్వుల సుగుణాలతో మానవ సం బంధాలు, ప్రపంచ శాంతి, సోదరభావం, స్నేహబంధాలు లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. దినచర్యలో సదా నవ్వగలిగిన వారు చాలా అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులుగా అందరి దృష్టినీ ఆకర్షి స్తారు. నవ్వడం, నవ్వులను పంచడమే జీవిత పరమార్థంగా బతకడం అలవర్చుకోవాలి. నవ్వడంతో  శారీరక వ్యాయా మం జరిగి జీవ వ్యవస్థ సర్దుకుంటుంది. ఆశావహ దృక్ఫథం కలిగిన వ్యక్తులు ఎల్లవేళల నవ్వుముఖంతో అందంగా ఉంటా రు. నవ్వులవల్ల వ్యాధి నిరోధకశక్తిని పెంచే కణాలు ఉత్తేజితం అవుతాయి, రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె, ఊపిరితిత్తులకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇంతే కాదు, కండరాలకు వ్యాయామం కలుగుతుంది. శరీరంలోని స్ట్రెస్ హార్మోన్స్ మోతాదు తగ్గుతుంది. అధిక రక్తపోటును తగ్గించడానికి నవ్వడమనే ఔషధాన్ని వాడాలి. నవ్వటం వల్ల ఎండార్ఫిన్ ఉత్తేజితం కావడంతో నొప్పులకు తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. ప్రతి రోజు 10 నిమిషాలు నవ్వటంతో దాదాపు 40 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. కోపం, ఉద్రేకం, ఆందోళన, ఒళ్లు నొప్పు లు తగ్గుతూ జీవితకాలం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, సృజనశీలత, మానవ సంబంధాలు, ప్రాణవాయువు సరఫరాలను పటిష్ట పరిచే సహజ వ్యాయామంగా నవ్వులు ఉపయోగపడతాయి. క్యాన్సర్ థెరపీకి లాఫింగ్ సహకరిస్తుంది. 

మానసిక ధృడత్వానికి చిరునామా

మానసిక ధృఢత్వానికి నవ్వులతో స్నేహం చేయడం ఉత్తమం. మనం నవ్వి తే మన చుట్టు ఉన్న సమాజం కూడా నవ్వుతుంది. నవ్వటంతో శరీరంలో వాం ఛనీయ మార్పులు జరగడమే కాకుండా మన తోటి ప్రపంచంలో సానుకూల మార్పులు వస్తాయి. నవ్వుకు సమాధా నం నవ్వే అని గుర్తుంచుకోవాలి. ‘కరోనా పాండెమిక్‌కు సరైన సమాధానం హాపీ-డెమిక్’ అని నమ్మాం. నవ్వుల పుష్కల పంటలు లేని జీవితం కరువు కాటకాల తో సమానమని అర్థం చేసుకోవాలి. నవ్వుల సంపదలు లేని జీవితం నరక సమానం. 

మనం నవ్వుతూ ఇతరుల ముఖాల్లో నవ్వుల పువ్వులు పూయించడానికి ప్రయత్నిద్దాం. నవ్వటం నాలుగు విధాల చేటు కాదని, పలు విధాల మేలని గుర్తుంచుకుంటూ, సదా నవ్వుతూ, నవ్వులను పంచుదాం. నవ్వటం ఓ యోగం, నవ్వక పోవడం ఓ రోగం అని మరువరాదు. బీ హాపీ మేక్ అదర్స్ హాపీ. వీలైనంత వరకు నవ్వుదాం, నవ్వులు పంచుదాం. 


డా॥ బుర్రా మధుసూదన్ రెడ్డి

సెల్: 9949700037