13 May, 2026 | 1:59 AM

ఘనంగా ప్రపంచ నర్సింగ్ దినోత్సవం

13-05-2026 01:27 AM

మధిర, మే12 (విజయక్రాంతి): కోన సత్యనారాయణ గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ నర్సింగ్ డే వేడుకలను నిర్వహించారు. మంగళవారం మధిర పట్టణంలోని తేళ్ల వసంతయ్య మెమోరియల్  హై స్కూల్ ఆవరణలో కోన సత్యనారాయణ గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సింగ్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించినారు.

ఈ సందర్బంగా  మండలం పరిధి లోని ఆరోగ్య సిబ్బంది, వివిధ సబ్ సెంటర్స్ లో పనిచేసే  నర్సింగ్ ఆఫీసర్స్ ను సత్కారించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ.... ప్రజల ఆరోగ్య సంరక్షణలో నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక రోగులకు సేవలను అందిస్తారన్నారు.

మనకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రికి వెళ్ళినపుడు డాక్టర్ కన్నా ముందు వచ్చి మనకు సహాయం చేసేది నర్సులే అని అన్నారు. ఈ కార్యక్రమం లో కోన సత్య నారాయణ గుప్తా ఫౌండేషన్ సెక్రటరీ  లక్ష్మి సావిత్రి, డాక్టర్ పృథ్వి రాజ్ నాయక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీస్ ర్ వి వెంకటేశ్వర్లు టీవీఎం వాకింగ్ క్లబ్ కమిటీ ప్రసిడెంట్ లింగంపల్లి వెంకాయమ్మ విశ్వ నాధం,  నర్సింగ్ సిబ్బంది సృజన అరుణ, వి విజయ్ కుమారి వి భారతి తదితరులు పాల్గొన్నారు.