calender_icon.png 10 November, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుబాయ్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు

10-11-2025 12:00:00 AM

డిసెంబర్ 12 నుంచి 14 వరకు నిర్వహణ

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలు డిసెంబర్ 12 నుంచి 14 వరకు దుబాయ్‌లోని దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో నిర్వ హించనున్నట్టు ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి  (డబ్ల్యూటిఐటిసి) అధికారికంగా ప్రకటించింది. మూడు రోజుల ఈ అంతర్జాతీయ మహా సభలు డిసెంబర్ 12న ప్రత్యేకమైన నెట్వర్కింగ్ ఈవెంట్, యాచ్ పార్టీతో ప్రారంభమవుతుంది.

డిసెంబర్ 13, 14 తేదీల్లో ప్రధాన సమావేశాలు, డబ్ల్యూటిఐటిసికు 2026 కాలానికి నియమిం చబడిన నూతన నాయకత్వం వహించేవారు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించబడే ప్రపంచ తెలు గు ఐటీ మహా సభలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తల అత్యంత ప్రాధాన్యమై నప్రపంచ సమావేశాల్లో ఒకటిగా అవతరించింది. 100కి పైగా దేశాల నుంచి తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, మరియు ఆవిష్కర్తలు ఒక వేదికపైకి రానున్నారు.

ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బ్లాక్చైన్, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ డిజైన్, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫిన్టెక్ మరియు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ వంటి అత్యాధునిక రంగాల్లో జరుగుతున్న పురోగతులను ప్రదర్శించనున్నారు. యూఏ ఈ ప్రభుత్వానికి చెందిన మంత్రులు, రాజ కుటుంబ ప్రతినిధులు, విధాననిర్మాతలు అలాగే ఆసియా, యూరప్ మరియు ఉత్తర అమెరికా నుండి వచ్చే అంతర్జాతీయ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి తమ అధికారిక మద్దతును ప్రకటించా యి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సిద్ధంగా ఉండేందుకు, డబ్ల్యూటిఐటిసి దుబాయ్ లీడర్షిప్ టీమ్ ఇటీవల దుబాయ్ వరల్ ట్రేడ్ సెంటర్లో ఒక ప్రణాళికా సమావేశం నిర్వహించింది. ఈ సమావే శంలో 40 మందికి పైగా కోర్ సభ్యులు, నిర్వాహకులు పాల్గొని, ఈ మహా సభకు సంబంధించిన లాజిస్టిక్స్ మరియు అమలు ప్రణాళికలను తుది రూపమిచ్చారు.

2023 లో సింగపూర్‌లో పొందిన అపార విజయానంతరం, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సాంకే తిక నిపుణులను ఏకైకంగా కలపడానికి మా తదుపరి స్థానం దుబాయ్ అవుతుంది అని డబ్ల్యూటిఐటిసి చైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరా ల కోసం www.wtitc.org లో లేదా +91 81231 23434 (ఇండియా), +971 56577 8923 (యూఎఇ) నంబర్లలో సంప్రదించవచ్చు.