calender_icon.png 10 November, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచార హక్కు కార్యకర్తలకు అన్ని విధాలా సహకారం

10-11-2025 12:00:00 AM

తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ దేశాల భూపాల్

ముషీరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ప్రజల కోసం పనిచేసే సమాచార హక్కు కార్యకర్తలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ దేశాల భూపాల్ అన్నారు. వారికి త్వరలోనే ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన సాధన కమిటీ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు.

ప్రజాస్వామ్యంలో అవినీతి అంతం కావాలంటే ప్రతి ఒక్క పౌరుడు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం రెండు సంవత్సరాలలో ఆర్టీఏ కమిషనర్లు ఏర్పాటు చేయక పోవడం వల్ల 18 వేల దరఖాస్టులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. తాము వచ్చిన ఆరు నెలల్లో 7 వేలకు పైగా దరఖాస్తులు పరిష్కరించమని అన్నారు. తమ దృష్టికి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

సమాచార హక్కు చట్టంపై పాఠ్యఅంశాలలో చేర్చే అంశంపై కమిటీ చర్చించినట్లు తెలిపారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినీ నటు డు సూర్య కిరణ్ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం వజ్ర ఆయుధం లాంటిదని అన్నారు. 2005 లో వచ్చిన ఈ చట్టంతో ప్రజలకు నేటికి సరైన సమాచారం ప్రభుత్వ అధికారుల నుంచి రాకపోవడం దురదృష్టకరం అన్నా రు.  ఈ కార్యక్రమంలో చింతల రాఘవేందర్, కాశీ సతీష్ కుమార్, కడమంచి అజయ్ కుమార్, రాజశేఖర్, ప్రకాష్ పటేల్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.