calender_icon.png 13 December, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్రాంత ఉద్యోగులు పోరాడి సాధించిన హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి

12-12-2025 02:15:19 AM

జాతీయ పెన్షనర్ల సంఘ సెక్రటరీ జనరల్ సుధాకర్

కోదాడ, డిసెంబర్ 11: విశ్రాంత ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని జాతీయ పెన్షనర్ల సంఘ సెక్రటరీ జనరల్ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య ఆహ్వానం మేరకు గురువారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.

2025 మార్చి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన పెన్షన్ రూల్స్ ను సవరిస్తూ పెన్షనర్ల పై పూర్తి అధికారం ప్రభుత్వాలు తీసుకునే విధంగా చట్టాన్ని తీసుకువచ్చిందని దీనిని వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కానీ రాష్ట్రంలో పెన్షనర్ల పరిస్థితి దీనంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య, కోదాడ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, రాజేంద్ర బాబు, లింగన్న, ప్రభాకర్, పొట్ట జగన్మోహన్, జానయ్య, రఘువర ప్రసాద్, విద్యాసాగర్, భ్రమరాంబా, శోభ, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.