26 June, 2026 | 8:48 PM

పాక్‌కు అనుకూలంగా రాతలు

06-08-2024 02:26 AM

ఢిల్లీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలకలం

న్యూ ఢిల్లీ, ఆగస్టు 5: ఢిల్లీలో ఇంటి గోడలపై పాకిస్థాన్ దేశానికి అనుకూలంగా స్లోగన్లు రాసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ రోహిణి ప్రాంతంలోని అవంతిక సీ్ర ఉంటున్న యువకుడు తన ప్లాట్‌లోని గోడపై పాకిస్థాన్‌కు మద్దతుగా ‘లాంగ్ లివ్ పాకిస్థాన్’, ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు రాశాడు.

అపార్ట్‌మెంట్‌లో ఉండే కొందరు ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వచ్చి సోదాలు చేశారు. గోడలపై పాకిస్థాన్ అనుకూల స్లోగన్లు, చార్ట్‌లు చూసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు మానసికంగా స్థిరంగా లేడని, ఒంటరిగా ఉంటు న్నాడని పోలీసులు గుర్తించారు.