గిరి ప్రదక్షిణంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు
స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్ర సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి వైభవంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.
స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.గిరి ప్రదక్షిణం లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండ కింద గిరి ప్రదక్షిణంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద ఆలయ కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్ తో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణను చేశారు. గిరి ప్రదక్షిణనంలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది, అర్చకులు మరియు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దర్శన అనంతరం వేద ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.