calender_icon.png 22 October, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదవులు రాజకీయ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

21-10-2025 11:21:39 PM

మంథనిలో అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేషం యాదవ్..

మంథని (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని యాదవులు రాజకీయ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం పిలుపునిచ్చారు. ఈనెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘాల కన్వీనర్ సౌగాని కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాదర్ గూడెంలోని ఫామ్ అరవింద రిసార్ట్ లో నిర్వహించే రాజకీయ శిక్షణ శిబిరాన్ని అన్ని పార్టీలకతీతంగా యాదవ సోదరులకు రాజకీయ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రాజకీయ మెలకువలు నేర్పించనున్నామన్నారు. రాజకీయ శిక్షణ శిబిరాలను మంథని డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల యాదవ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మంథని మండల అధ్యక్షుడు పర్షవేని మోహన్ యాదవ్, నాయకులు ఉడుత పర్వతాలు యాదవ్, గోకుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్, కార్యవర్గ సభ్యులు శీలారం పర్వతాలు యాదవ్, కార్యదర్శి ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, ముత్తారం మండల అధ్యక్షుడు కాసు తిరుపతి యాదవ్, మంథని మండల ఉపాధ్యక్షులు కనగంటి ఓదెలు యాదవ్, వేముల లక్ష్మయ్య యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెగడ శ్రీనివాస్, కనెవేన శ్రీనివాస్ యాదవ్, జాగరి సదానందం యాదవ్, కనవేన కొమురయ్య యాదవ్, కనవేన రమేష్ యాదవ్, మోత్కు రాజబాబు యాదవ్, జక్కుల కుమార్ యాదవ్, మాదరవేన ఓదెలు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.