calender_icon.png 22 October, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్ టవర్ ఎక్కి వృద్ధుని హల్‌చల్

22-10-2025 12:00:00 AM

బతకాలని లేదు.. పైనుంచి దూకి చచ్చిపోతా అంటూ ఆవేదన 

భిక్కనూర్ ఎస్‌ఐ హామీతో కథ సుఖాంతం 

కామారెడ్డి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఉన్న భూములను అమ్ముకొని మాకు ఏమీ మిగిలించకుండా చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఓ వృద్ధుని పై గరం గరం ఇచ్చాయి తిట్టడంతో ఆక్రోషం చెందిన వృద్ధుడు సెల్ టవర్ ఎక్కి దూకి చేస్తానని ఆందోళన చేపట్టిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య (65)సంవత్సరాలు మద్యానికి బానిసై ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్ముకున్నాడు. డబ్బులు అన్ని ఖర్చు చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు మల్లయ్యను చివాట్లు పెట్టారు. అతని కుమారులు గరం గరం చాయ్ ఒంటిపై పోస్తామంటూ బెదిరించారు.దీంతో కలత చెందిన మల్లయ్య మంగళవారం గ్రామ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి చస్తానంటూ హల్చల్ చేశారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న భిక్కనూర్ ఎస్త్స్ర ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని వృద్ధునికి నచ్చ చెప్పారు. దీంతో మల్లయ్య సెల్ టవర్ దిగడంతో కథ సుఖాంతమైంది. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక మల్లయ్యను ఏమి అనమని చెప్పడంతో మల్లయ్య శాంతించి ఇంటికి వెళ్లారు. పోలీసులు సమయస్ఫూర్తిగా వివరించి మల్లయ్య ను కిందికి దించి పంపించడంతో గ్రామస్తులు పోలీసులను అభినందించారు.