15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

రైతులు సీసీఐలో పత్తి అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ తప్పని సరి

22-10-2025 12:00 AM

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

కామారెడ్డి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): పత్తి రైతులు సి సి ఐ లో  పత్తి అమ్ము,కునుటకు ముందుగా కాపాస్ కిసాన్ ఆప్ తమ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాల అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ తెలిపారు. ముందుగా రైతు నమోదు చేసుకోని, తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. జిల్లాలోని మద్నూర్ లో గల జిన్నింగ్ మిల్లు కృష్ణా నాచురల్ ఫైబర్ జిన్నింగ్ మిల్లును ముందుగా సి సి ఐ వారు ఎల్ 1 లో ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఈ జిన్నింగ్ మిల్లు మాత్రమే కనబడుతుందన్నారు.రైతులు స్లాట్ బుకింగ్ చేసి ఏ రోజు అనేది తేదీ పైన క్లిక్ చేస్తే ఆమోదం వస్తుందన్నారు. ఒక వేళ రైతులు ఫ్లాట్ బుక్ చేసుకొని యెడల ఆ గ్రామం ఏ ఈ ఓల వద్దకు గానీ, మండల వ్యవసాయ అధికారుల వద్దకు లేదా జిల్లాలోని ఏ మార్కెట్ కమిటీ కార్యాలయాల వద్దకు వెళ్ళిన స్లాట్ బుకింగ్ చేసి ఇస్తారని తెలిపారు. దీనికి స్మార్ట్ ఫోన్ ఉండాలన్నారు. స్మార్ట్ ఫోన్ లేని యెడల సంబంధిత అధికారులు వద్దకు వెళ్తే రైతులకు ఓటిపి  వస్తుంది.

దానిని రైతులు అధికారులకు చెప్పిన యెడల వారు స్లాట్ బుకింగ్ చేస్తారు. రైతులకు మెసేజ్ రూపంలో ఆమోదం వస్తుందన్నారు.స్లాట్ బుకింగ్ లేకుండా సిసిఐ లో అమ్ముకోవడానికి వీలు లేదన్నారు. పత్తి రైతులు సి సి ఐ లో అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుక వాలన్నారు.. 8% మాత్రమే తేమ ఉండేవిధంగా మంచిగా అరబెట్టుకుని రూ.8110/-ఎం ఎస్ పి ధర రైతులు పొందాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.