5 March, 2026 | 5:06 AM

ఇంటిమేట్ సీన్స్‌కు సై!

05-03-2026 01:56 AM

బాలీవుడ్ సీరియల్ కిస్సర్‌గా గుర్తింపు పొందిన బాలీ వుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ. ఆయన సినిమా అంటే గాఢమైన లిప్‌లాక్‌లు తప్పనిసరి అన్న మినిమమ్ గ్యారెంటీ ఉండేది సినీప్రియు లకు! హష్మీ తన రెండు దశాబ్దాల ప్రయాణంలో దాదాపు 15 ఏళ్లు ముద్దు సీన్లలో నలిగిపోయాడు.

అయితే, కొన్నేళ్లుగా ఇమ్రాన్ హష్మీ తన ఇమేజ్‌నున మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే ‘టైగర్ 3’ వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించాడు. ఇప్పుడు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నాడు. అలా 2019 నుంచి చుంభనాలకు దూరంగా ఉంటున్న హష్మీ.. తాజాగా తనలోని సీరియల్ కిస్సర్‌ను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. దర్శకుడు నితిన్ కక్కర్ ప్రస్తుతం ‘అవారపన్’కు సీక్వెల్‌గా ‘అవారపన్2’ని తెరకెక్కిస్తున్నారు.

దీంట్లో ఇమ్రాన్ హష్మీ హీరో కాగా, హీరోయిన్‌గా దిశా పటానీ నటిస్తోంది. ఇందులో కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయట. నాయకానాయికల మధ్య సన్నిహిత సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. ఇక గ్లామర్ డాల్ దిశా పటానీ కూడా గ్లామర్ పాత్రలకు, ఇంటిమేట్ సన్నివేశాలకు నో చెప్పే నటి కాదు. ఆరేళ్లగా ఇమ్రాన్ హష్మీ ‘నో కిస్’ పాలసీ పాటిస్తున్నాడు కాబట్టి లిప్‌లాక్ లేకుండా ఇంటిమేట్ సన్నివేశాలు డిజైన్ చేశారా? లేక పాలసీని పక్కనబెట్టేశాడా? అనే విషయమై ప్రస్తుతానికి స్పష్టత లేదు. వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాపై తాజా వార్తలు అంచనాలు భారీగా పెంచేశాయి.