17 July, 2026 | 2:02 AM

తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం కార్యవర్గం ఏర్పాటు

17-07-2026 02:02 AM

తెలంగాణ యూనివర్సిటీ, అధ్యక్షుడిగా పుప్పాల రవి, కన్వీనర్‌గా డాక్టర్ సిద్దలక్ష్మి నియామకం

ఎల్లారెడ్డి జులై,16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం విద్యార్థి సంఘం నేతలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తొలి మలిదశ ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషించి స్వరాష్ట్ర సాధనకై కృషి చేసిన విద్యార్థి నేతలు తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఏర్పాటు చేయనైనది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షులుగా ఉప్పాల రవి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం కన్వీనర్ గా డాక్టర్ సిద్ధ లక్ష్మి నియామకమైనట్లు ఆమె పత్రికా ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర కన్వీనర్ గా తనకు స్థానం కల్పించిన ఉద్యమకారులు అందరికీ నమస్సుమాంజలి. పత్రికా ప్రకటనలు ఆమె మాట్లాడుతూ 2009 నుండి తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాటుపడి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేశామని దానికి ప్రతిఫలంగా స్వరాష్టాన్ని సాధించుకొని నేడు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఎందరో విద్యార్థులు వారికి అందాల్సిన సంక్షేమ ఫలాలు ప్రభుత్వ పథకాలు, అందుతున్నాయని నా తెలంగాణలో ఎందరో విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసిస్తూ రానున్న రోజుల్లో ఉన్నత స్థాయి శిఖరాలను అధిరోహిస్తారని ఆశిస్తున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ కన్వీనర్ గా నన్ను నియమించి నాపై నమ్మకంతో నాకు పదవిని అందించిన నా కార్యవర్గ సభ్యులకు నా తో ఉద్య,మకారులందరికి సమన్యాయం చేస్తానని అన్నారు.