ఘనంగా యెల్లో సఫైర్ హోటల్ ప్రారంభం
డీఎల్‌ఎఫ్ సైబర్ సిటీలో ఏర్పాటు
పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు
ఆతిథ్య రంగంలో మరో మైలురాయి
హైదరాబాద్, మే 5(విజయక్రాంతి): నగరంలోని ప్రముఖ బిజినెస్ హబ్ డీఎల్‌ఎఫ్ సైబర్ సిటీలో ‘ఎల్లో సాఫైర్ హోటల్’ నూత న బ్రాంచ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఆతి థ్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ‘ఎల్లో సఫైర్’ బ్రాం డ్‌కు ఇది నాలుగవ ప్రాపర్టీ. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రము ఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొని హోటల్‌ను ప్రారంభించారు.
వారితో పాటు టాలీవుడ్ నటీనటులు కార్తీక్ దండు, షఫీ (నటుడు), మహేష్ అచ్చంట, మధు దామరాజు, అశోక్ బండ్రెడ్డి, కె. సుధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్లో సఫైర్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గోలి మాట్లా డుతూ ‘ఇది మా చిరకాల స్వప్నం. అతిథులకు కేవలం వసతిని మాత్రమే కాకుండా, ‘ఇంటికి దూరంగా మరో ఇల్లు’ లాంటి అనుభూతిని అందించడమే మా లక్ష్యమన్నారు.
హోటల్ ప్రత్యేకతలు
ఆధునిక ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యం, పనితీరు, సౌందర్యంతో ఈ హోటల్‌ను రూపొందించారు. ఈ 4వ బ్రాంచీతో ఆతిథ్య రంగంలో ఎల్లో సఫైర్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. నాణ్యమైన సేవలు, వ్యక్తిగత శ్రద్ధ, మరపురాని అనుభవాలను అందించడానికి తమ బృందం కట్టుబడి ఉందని యాజమాన్యం పేర్కొంది. భవిష్యత్తులో మరిన్ని గొప్ప సేవలతో అతిథులను ఆహ్వానిస్తాం’ అని ప్రవీణ్ కుమార్ గోలి పేర్కొన్నారు.






