5 May, 2026 | 4:12 AM

ఆస్తమాను జయించి స్వేచ్ఛగా జీవించండి

05-05-2026 02:44 AM

డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): ప్రపంచ ఆస్తమా దినోత్సవం (మే 5) సందర్భంగా నారాయణగూడలోని శ్వాస హాస్పిటల్ చైర్మన్, శ్వాస ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. 1998 నుంచి ఆస్తమాపై నిరంతర పోరాటం చేస్తున్న శ్వాస హాస్పిటల్, ఈ ఏడాది ‘అందరికీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇన్‌హెల్లర్ల లభ్యత‘ అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇన్హేలర్లు రక్షణ కవచా లు, ఆస్తమా అంటే ఊపిరితిత్తుల గాలి గొట్టాల వాపు. కేవలం ఆయాసం ఉన్నప్పుడే కాకుం డా, డాక్టర్ సూచించిన యాంటీ-ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్లను క్రమం తప్పకుండా వాడాలి. ఇవి వ్యసనం కావు, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను నివారిస్తాయి. పిల్లల్లో ఆస్తమా ఉంటే వారి ఎదుగుదల, చదువు, ఆటలపై ప్రభావం పడుతుంది. ఇన్హేలర్లతో పాటు వారికి సరైన శ్వాస వ్యాయామాలు అలవాటు చేయడం వల్ల వారు సాధారణ పిల్లల్లాగే చురుకుగా ఎదగగలరు.

ముక్కుతో 4 సెకన్లు శ్వాస తీసుకుని, పెదవులను ఈలలా ముడిచి 6-8 సెకన్ల పాటు మెల్లగా వదలాలి. ఇది శ్వాసనాళాలను తెరిచి ఉంచి, ఆందోళనను తగ్గిస్తుంది. ఆస్తమా అంటువ్యాధి కాదు. సరైన చికిత్స, పరిసరాల శుభ్రత మరియు శ్వాస సాధనలతో ఆస్తమా ను పూర్తిగా నియంత్రించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. ‘ఔషధాలు ఎంత అవస రమో, శ్వాసపై నియంత్రణ కూడా అంతే ముఖ్యం. వదిలేయడం నేర్చుకుంటేనే జీవితం సులభం అవుతుంది’ అని డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని పేర్కొన్నారు.