పంజాబ్ నేషనల్ బ్యాంక్ నూతన శాఖ ఏర్పాటు
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ప్రారంభం
హైదరాబాద్, మే ౫(విజయక్రాంతి): పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన నూతన శాఖను హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభించింది. బ్యాంకు ఉన్నతాధికారులు, అతిథులు, అసోసియేషన్ సభ్యులు, వినియోగదారుల సమక్షంలో జోనల్ మేనేజర్ (జడ్ ఎం మేడమ్) పీఎన్‌బీ శాఖ ప్రారంభించారు.
నూతన శాఖ విజయవంతం కావా లని, అభివృద్ధి చెందాలని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అతిథులకు స్వాగతం పలికారు. బ్యాంకు ఉ న్నతాధికారులు అరవింద్ కల్రా, సర్కిల్ హెడ్, హైదరాబాద్, సుజీత్ కుమార్ ఝా, సర్కిల్ హెడ్, సికింద్రాబాద్ వందన పాండే, జోనల్ మేనేజర్, హైదరాబాద్ ప్రసంగించా రు. బ్యాంకు నెట్‌వర్క్‌ను విస్తరించడం, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సేవలను అందించడం, ఈ ప్రాంతంలో ఆర్థిక సమతుల్యతను బలోపేతం చేయడం పట్ల తమ కున్న అంకితభావాన్ని వారు పేర్కొన్నారు.






