26 August, 2026 | 11:07 PM

ఒత్తిడిని జయించే అద్భుత సాధనం యోగా

20-06-2026 07:24 PM

ఐపీఎస్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్నిపెంపొందించడంతో పాటు ఒత్తిడిని జయించే అద్భుత సాధనమని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ పేర్కొన్నారు.  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం పాఠశాలలో ఘనంగా యోగ డే వేడుకలు నిర్వహించారు.యోగా శిక్షకులు, పీఈటీల ఆధ్వర్యంలో విద్యార్థులతో సూర్య నమస్కారాలు, పద్మాసనం, చక్రాసనం, భుజంగాసనం, హలాసనం తదితర యోగాసనాలు చేయించారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ యోగా ద్వారా శరీర దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని వివరించారు. విద్యార్థులు ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవచ్చని సూచించారు.