21-06-2025 07:44:39 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎస్పీ రాకేష్ మీనా పోలీస్ సిబ్బంది యోగ ఆసనాలను శనివారం నిర్వహించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి రోజు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మా పిల్లలు కూడా యోగాలు నేర్పించుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు గోవర్ధన్ కృష్ణా ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.