19 April, 2026 | 8:49 AM

ఘనంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పెళ్లిరోజు వేడుకలు

21-06-2025 07:42 PM

వరంగల్ (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) వివాహ వార్షికోత్సవ వేడుకలను రవిచంద్ర యూత్ వింగ్ ఆధ్వర్యంలో వరంగల్ లో ఘనంగా నిర్వహించారు. శ్రీ భద్రకాళి దేవాలయంలో రవిచంద్ర విజయలక్ష్మి దంపతుల గోత్రనామాలతో అమ్మవారికి పండితులు నాగరాజ్ శర్మ అరవింద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేవాలయ ప్రాంగణంలో సుమారు వెయ్యి మంది భక్తులకు అన్నదాన ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వద్దిరాజు రవిచంద్ర వ్యక్తిగత సహాయకుడు వీణవంక కిరణ్ కుమార్, యూత్ వింగ్ సభ్యులు సిరిమల్ల కిరణ్, ఏరుకొండ వినయ్, నాగపురి రమేష్ గౌడ్, నానావరపు సందీప్, వడ్లకొండ శ్రీకర్ గౌడ్, మహేష్, శివాజీ, శ్రవణ్, ఆరెల్లి సుభాష్, చింటూ తదితరులు పాల్గొన్నారు.