21 June, 2026 | 1:39 AM

యోగా విశ్వంతో మమేకమయ్యే జీవనశైలి!

21-06-2026 12:00 AM
  1. ప్రముఖ న్యాయవాది, జర్నలిస్ట్ హెబ్బార్ నాగేశ్వర రావు
  2. విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, జూన్ 20(విజయక్రాంతి): ‘యోగా అంటే కేవలం కొన్ని శారీరక ఆసనాలు వేయడం కాదు.. అది గతాన్ని, భవిష్య త్తును అనుసంధానిస్తూ, ప్రకృతితో.. ఈ విశ్వంతో మనల్ని మమేకం చేసే ఒక అద్భుతమైన జీవనశైలి’ అని ప్రముఖ న్యాయవా ది, జర్నలిస్ట్ తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వర రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ లో శనివారం 12వ ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలను ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ అనే ఇతివృత్తంతో ఘనంగా నిర్వహించారు.

డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హెబ్బార్ నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థుల్లో సరికొత్త స్ఫూర్తిని నిం పారు. భారతదేశం ప్రాచీన కాలం లో నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలతో ప్రపంచానికే ది శానిర్దేశం చేసి ‘విశ్వగురువు’గా విరాజిల్లిందని గుర్తుచేశారు. యో గా అనేది కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, అంతకు మించి మానసిక ప్రశాంతతకు ఎంతో అ వసరమన్నారు.

నిరంతరం యోగా సాధన చేసేవారు మానసికంగా ఎంతో దృఢచిత్తంతో ఉంటారన్నారు.  ప్రస్తుత అస్తవ్యస్తమై న బిజీ జీవితాల వల్ల యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలకు యోగా ఒక శక్తివంతమైన మైండ్‌పుల్‌నెస్ సాధనగా పనిచేస్తుందని చెప్పారు. ప్రతిరోజూ కనీసం ఒక అరగంట అయినా యో గా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు, శ్వాసక్రియ శక్తి మెరుగవుతుందని, బరువు తగ్గడం సాధ్యమవుతుం దని వివరించారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు, ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.