మీరు గ్రామాల్లో తిరగలేరు
- మా కార్యకర్తలు తలుచుకుంటే మీరు ఆగమే
- కాంగ్రెస్ నాయకులందరు నాలుకను అదుపులో పెట్టుకోవాలి
- రైతులకు భూపరిహారం ఇచ్చాకే కోహెడ వద్ద పండ్ల మార్కెట్ పెట్టాలి
- రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే దిక్కులేదు
- తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనేక కీలక ప్రాజెక్టులను మంజూరు చేసింది
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జూన్7(విజయక్రాంతి): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని పొలిమేర దాటనీయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారని, తమ కార్యకర్తలు తలచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే లు, నాయకులు గ్రామాల్లో తిరగలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్చరించారు. రైతులు వ్యతిరేకిస్తున్నా కోహెడ పండ్ల మార్కెట్‌కు శంకుస్థాపన చేశారని, రైతుల భూములకు పరిహారం ఇచ్చాకే పండ్ల మార్కెట్ పెట్టాలని డిమాండ్‌చేశారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు రైతుల భూములు కాజేస్తున్నారని, ధాన్యం కొనుగోలు చేయకుండా అన్నదాతలను ఇబ్బందులు పెడు తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభు త్వం నుంచి రూ.13 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చామని, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై సచివాలయం వద్ద చర్చకు సిద్ధ మా అని సవాల్ విసిరారు.
కోహెడలో సర్వే నంబర్ 167/1లో 239 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, అయితే ఈ భూములు రైతులకు చెందినవని, రైతుల నుంచి భూములను సేకరించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా సరైన నష్ట పరిహారం చెల్లించకుండా బలవంతంగా స్వాధీనం చేసుకొని ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి..
రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా వారి భూములను స్వాధీనం చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని రాంచందర్‌రావు మండిపడ్డారు. రైతుల భూములు లాక్కొని, వారినే అరెస్ట్ చేసి, అదే రైతుల సంక్షేమం గురించి మా ట్లాడటం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందని విమర్శించారు. రైతులకు పూర్తి స్థాయి లో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టాలని, అప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభించకూడదని బీజేపీ స్పష్టంగా డిమాండ్ చేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తమ నాలుకను అదుపులో పెట్టుకోవాలని, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులపై అసత్య ప్రచారం మానుకోవాలని హెచ్చరిం చారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని, ఆగమైపోతారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, అన్యా యాలు చేస్తూ ప్రజల మధ్య తిరగాలని భావించడం సాధ్యం కాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అనేక కీలక ప్రాజెక్టులను మంజూరు చేసిం దని, ఇటీవల జగిత్యాలతోపాటు పలు ప్రాంతాలకు జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ.8 వేల కోట్ల నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. రియ ల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉన్న సమయంలో రైతుల భూములను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.






