8 June, 2026 | 2:14 AM

విద్యుత్ షాక్‌తో బాలుని మృతి

08-06-2026 12:55 AM

సోనాల మండలంలో విషాద ఘటన

బోథ్, జూన్ 7 (విజయక్రాంతి): విద్యుత్ షాక్ తగిలి బాలుడు దుర్మరణం చెందిన విషాద ఘటన సోనాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని సాకేర (సూర్య నగర్) గ్రామానికి చెందిన ఆడే అర్జున్ - అరుణ దంపతుల కుమారుడు ఆడే ధీరజ్(6) అనే బాలుడు ఆదివారం ఇంట్లో కూలర్ ను తాకగా, కరెంట్ షాక్ కు గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు బాలున్ని బోథ్ ఆసుపత్రికి తరలించగా, బాలుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో బాలుని ఇంట్లో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.