8 June, 2026 | 2:14 AM

నాచారం గుట్టలో భక్తజన సందోహం

08-06-2026 12:54 AM

గజ్వేల్, జూన్ 7: సిద్దిపేట జిల్లా నాచారం గుట్టలోని శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఆదివారం సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరో వారంలో వేసే సెలవులు ముగుస్తుండడంతోపాటు అధిక జ్యేష్ట మాసం కావడంతో స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి నామస్మరణ చేస్తూ భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణ అధికారి బెల్లంకొండ రంగాచారి పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ తదితర ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించారు.