నన్ను స్క్రీన్ మీద చూస్తే భయపడాల్సిందే
సుమన్ బాబు కథానాయకుడిగా నటిస్తూ దర్శక నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘ఎర్రచీర - ది బిగినింగ్’. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 27న విడుదల కానుంది. శనివారం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి నిర్మాత సీ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ బాబు మాట్లాడుతూ.. ‘ఎర్రచీర - ది బిగినింగ్’ మూవీకి హీరో వెంకటేశ్ దగ్గర నుంచి నిర్మాత కల్యాణ్ వరకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు.
కమల్ కామరాజు అనే యాక్టర్ మాత్రం మా ఫోన్స్ ఆన్సర్ చేయడం లేదు. ఆయన ఒక హీరో ఈ మూవీలో అయి ఉండి కూడా ప్రమోషన్‌కు రావడం లేదు. ఎంతో కష్టపడి మాలాంటి వాళ్లం మూవీ చేస్తే కనీసం ప్రమోషన్‌కు రాకపోవడం బాధాకరం’ అన్నారు. హీరోయిన్ కారుణ్య చౌదరి మాట్లాడుతూ..- ‘నేను ట్రైలర్‌లో మిమ్మల్ని భయపెట్టానని అనుకుంటున్నా. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది’ అన్నారు. నటి సంజన శెట్టి మాట్లాడుతూ.. ‘మా మూవీని తప్పకుండా మీరంతా ఇష్టపడతారు’ అని చెప్పారు.






