ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ పూర్తి చేయాలి
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
జుక్కల్ జూలై 16 (విజయక్రాంతి): ప్రతి ఇంటింటికి వెళ్లి అర్హులైన వారందరికీ ఎస్ ఐ ఆర్ ఫారాలను నింపి పూర్తి చేయాలని నియోజకవర్గంలోని కాంగ్రెస్ మండల అధ్యక్షులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారంను ప్రతి ఓటరుతో నింపించి, పాత ఓటరు వివరాలు లేదా 2002 ఓటరు జాబితా ఆధారంగా వివరాలను సక్రమంగా అప్డేట్ చేయాలని సూచించారు.
జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రతి అర్హుడి ఎస్ ఐ ఆర్ ఫారాన్ని పూర్తిచేయాలని అధికారులకు, సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 7080 శాతం ఎన్యూమరేషన్ ఫారాల ప్రక్రియ పూర్తయిందని, ఈ కార్యక్రమంలో కృషి చేస్తున్న BLOలు, సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయా మండలాల అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు.






