12 July, 2026 | 8:52 PM

యువతిపై కత్తితో దాడి... అక్కడికక్కడే మృతి

08-06-2024 05:47 PM

పంజాబ్: పంజాబ్ లో దారుణం జరిగింది. ఓ ఉన్మాది యువతిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మొహాలికి చెందిన యువతి(27) ఆఫీసుకు వెళ్తున్న సమయంలో రోడ్డుపై కాచుకొని ఉన్న యువకుడు ఒకసారిగా ఆమెపై దాడికి పాల్పడాడు. దీంతో ఆ యువతి ప్రాణాభయంతో రోడ్డుపై పరుగెత్తింది. యువకుడు ఆమెను పట్టుకొని కత్తితో దాడి చేసి అక్కడి నుండి వెళ్లిపోయడు. కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. దాడి గల కారణాలు ఇంకా తెలయాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.