యువభారత్ నవ శకం
- ఐర్లాండ్‌తో తొలి టీ20
- వైభవ్ పైనే అందరి చూపు
- సారథిగా శ్రేయాస్ శకం షురూ
భారత క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌కు సంబంధించి కొత్త శకం ఆరంభమవుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రయాణం మొదలుకానుండగా, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ కెరీర్‌కు తెరలేవబోతోంది. ఐర్లాండ్ తో సిరీస్ ద్వారా భారత యువ జట్టు సరికొత్తగా బరిలోకి దిగుతుండగా అందరి కళ్లు వైభవ్ పైనే ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న శ్రేయాస్ తొలి సిరీస్‌కు సన్నద్ధమయ్యాడు.
బెల్‌ఫాస్ట్, జూన్ 25 : ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెల్ ఫాస్ట్‌లో తొలి టీ20 జరగనుంది. భారత్ విజయంపై ఎటువంటి అనుమానం లేకున్నా యువ ఆటగాళ్లతో నిండిన యంగ్ ఇండియా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ము ఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంలో ఎలాం టి విధ్వంసం సృష్టిస్తాడో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గత ఏడాది కాలంగా అండర్ 19, ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన వైభ వ్ ఇటీవల శ్రీలంక వేదికగా ట్రై సిరీస్‌లోనూ భారత్ ఏ జట్టు తరపున విధ్వంసకర ఇన్నిం గ్స్ ఆడాడు. దీంతో ఈ చిచ్చర పిడుగుపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఐర్లాండ్ పై వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలుండగా సంజూ, అభిషేక్ శర్మలలో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి నెలకొంది. సంజూ ఏ స్థానం లోనైనా బ్యాటింగ్ చేయగలడు. అయితే అభిషేక్ మాత్రం ఓపెనర్ గానే ఆడతాడు.
దీంతో తుది జట్టు కూర్పుపై గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటే శ్రే యాస్ అయ్యర్ పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి సిరీస్ ఆడబోతున్నాడు. వచ్చే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టు కూర్పును సన్న ద్ధం చేసే పనిలో టీమ్ మేనేజ్ మెంట్ ఉంది. దీంతో వచ్చిన అవకాశాన్ని ప్రతీ యువ ఆటగాడు సద్వినియోగం చేసుకుంటేనే జట్టులో చోటు ఉంటుంది. లేకుంటే ప్లేస్ గల్లంతవ డం ఖాయం. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివ మ్ దూబే లాంటి టీ ట్వంటీ సెషలిస్టులతో భారత బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. అటు బౌలింగ్ లో హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
స్పిన్ వి భాగంలో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ కీల కం కానున్నారు. మరోవైపు తొలి టీ ట్వంటీ లో భా రీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్‌కు ఐర్లాండ్‌ను తేలిగ్గా తీసు కుంటే ఇబ్బందులు తప్పవని పలువురు సూ చిస్తున్నారు. కాగా బెల్ ఫాస్ట్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం ము ప్పు ఎప్పుడూ ఉంటుంది. టాస్ గెలిచిన కెప్టెన్ నిర్ణయంపై ప్రభా వం చూపవచ్చు. ముఖ్యంగా మొదటి ఆరు ఓ వర్లు ఇరు జట్ల కు చాలా కీలకం. ఆరంభంలోనే వికెట్లు పడితే మ్యా చ్ మలుపు తిరగడం ఖాయం. కొత్త బం తితో ఫాస్ట్ బౌలర్లు స్వింగ్ రాబ ట్టే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్కు మరింత అనుకూలిస్తుంది.
తుది జట్ల అంచనా
భారత్ : వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్/అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్‌శ్ర(కెప్టెన్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్/ప్రసిద్ధ కృష్ణ, రవి బిష్ణోయ్
ఐర్లాండ్ : రాస్ అడైర్, స్టీఫెన్, టక్కర్(కెప్టెన్), హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, డెలెనీ, డాక్‌రెల్, మాథ్యూ, మెక్‌కార్త్, గావిన్ హోయె, రుబెన్ విల్సన్






