బీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్ 25: బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుకున్నారని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు గురువారం బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో బొల్లం సైదులు,మద్ది రాములు,సార్ల హన్మంతు,లక్ష్మయ్య,గుడిసె అనిల్,సందీప్ తో పాటు పలువురు ఉన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి,పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అ న్నారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ దేశిడి సందీప్ రెడ్డి,పాలకేంద్ర మాజీ చైర్మన్లు పటేల్ సుందర్ రెడ్డి,చల్లా వేణుధర్ రెడ్డి,వార్డు సభ్యులు చెరుకు స్వరూపసైదులు,బొల్లం ప్రభాకర్,సత్యనారాయణ,నాయకులు జీడి మహేష్,సత్యనారాయణ,నోముల రమేష్,నర్సయ్య,ఎడ్ల శీను,బాలరాజు, లింగయ్య,కృష్ణారెడ్డి,మల్లయ్య తదితరులు ఉన్నారు.






