కాంగ్రెస్‌లో చేరిన యువ నాయకుడు ఎన్.శివానంద్ యాదవ్
పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ సెక్రెటరీ దండుగల యాదగిరి
సికింద్రాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం చూసి యువత కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు రమేష్ అన్నారు. బోయిన్ పల్లి డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు ఎన్ శివానంద్ ఆదివారం ఐ.కే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు
అనిల్ కుమార్, బండి రమేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గాలి బాలాజీ, నాగిరెడ్డి, దండుగల యాదగిరి, షేరీ సతీష్ రెడ్డి, గొట్టుముక్కలవెంకటేశ్వరరావు, డి.అశోక్, మల్లికార్జున, రమేష్, రాజేందర్, అస్లాం, శ్రీరాములు, లక్ష్మయ్య, మేకల రమేష్, కుక్కల రమేష్, పుష్పరెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




