2 March, 2026 | 3:16 AM

బీసీ రిజర్వేషన్లను ఇచ్చాకే ఎన్నికలు

02-03-2026 01:24 AM
  1. లేనిపక్షంలో కాంగ్రెస్‌కు బీసీలు తగిన బుద్ధి చెప్తారు

14 బీసీ సంఘాల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం  ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే జెడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్ర భుత్వానికి బీసీలు తగిన బుద్ధి చెబుతారని, రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ మేరకు ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సం ఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరు ణ్ కుమార్ అధ్యక్షతన 14 బీసీ సంఘాల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణ య్య మాట్లాడుతూ సమస్యకు ఒకవైపు న్యా య పరిష్కారం, ఇంకోవైపు రాజ్యాంగ పరమైన మద్దతు కోసం ప్రభుత్వం చిత్త శుద్ధితో పోరాటం చేయాలని చేయాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఒక్క రోజైన బీసీల రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

రిజర్వేషన్లు పెంచేంతవరకు ఉద్యమాన్ని నిష్క్రమించేది లేదని ఆయన హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచాకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు పగిళ్ల సతీష్ కుమార్, పల్లగొర్ల రాం దేవ్‌మోడీ, జీ అనంతయ్య, భీమ్‌రాజు, కృష్ణుడు, గుజ్జ కృష్ణ, గోరిగె మల్లేష్ యా దవ్, నిరంజన్  తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.

సమాజ అభివృద్ధికి విద్యే పునాది

సమాజ అభివృద్ధికి విద్యే పునాది అని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. విలువలతో కూడిన విద్యార్థులే భారత భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆది వారం పెద్ద అంబర్పేట్ శివగంగ కాలనీలోని సత్యం టెక్నో స్కూల్ నిర్వహించిన క్రిస్టల్ జూబ్లీ సెలబ్రేషన్స్2026 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 15 సంవత్సరాల విద్యా సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభా ప్రదర్శనలు, స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఆకట్టు కున్నాయి.

ఈ సందర్భంగా  రాజ్యసభ స భ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ  సమా జాభివృద్ధికి నాణ్యమైన విద్యే పునాది అని పేర్కొన్నారు. గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను అందించ డంలో సత్యం టెక్నో స్కూల్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఛైర్మన్ అండ్ కరస్పాండెంట్ గుజ్జ సత్యం, మాజీ బీసీ కమిషన్ చైర్మన్  వకులాభరణం కృష్ణమోహన్ రావు,

భూదాన్ పో చంపల్ మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. అరుణ్ కుమార్, బి-స్మాట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. శేఖర్ రెడ్డి, స్థానిక నాయకులు దండం రామ్ రెడ్డి, ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ గంజి అరవింద్, నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ తడక యాదగిరి, త్రివేణి సాహితి అధ్యక్షులు ప ట్నం కృష్ణకుమార్, బీసీ వెల్ఫేర్ సౌత్ ఇం డియా ఇన్చార్జి సూర్యనారాయణ, స్కూల్ డైరెక్టర్లు జిల్లా వెంకటేశం, గుజ్జ అపర్ణ, సౌజన్య , పద్మ తదితరులు పాల్గొన్నారు.