24 May, 2026 | 5:00 PM

బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో యువకుడు ఆత్మ హత్య కలకలం

24-05-2026 03:59 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట చౌరస్తాలో ఓ యువకుడు ఆత్మహత్య ఘటనా కలకలం రేపింది. పట్టణంలో బూడిదగడ్డ బస్తికి చెందిన కోడి శ్రీకాంత్ అనే వ్యక్తి శనివారం రాత్రి 11:30 గంటలకు  కంటా చౌరస్తలోని ఓర్డింగ్  బోర్డు కు ఉరివేస్కుని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోడి శ్రీకాంత్ బూడిదగడ్డ బస్తీకి చెందిన  కోడి రమేశ్ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

శ్రీకాంత్ పిన్నవయస్సులో ఉన్నప్పుడే తండ్రి  మృతిచెందాడు. కుటుంబం కటిక పేదరికంలోమలోమగుతున్నది. అమ్మ  సమ్మక్క సోదరుడు శ్రీనివాస్ కూలి చేస్కుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో  శ్రీకాంత్ తాగుడుకు బానిస అయ్యాడు. కూలి పని దొరకక మనస్థాపనికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.