18 August, 2026 | 12:31 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

గుంజపడుగు గ్రామపంచాయతీ వర్కర్లకు రూ.15 లక్షల ఇన్సూరెన్స్

24-05-2026 03:55 PM

గ్రామ సర్పంచ్ దండవేన సంధ్యబానేష్

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని గుంజపడగు గ్రామంలో విధులు నిర్వహిస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ కు రూ. 15 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ మంథని మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)  శ్రీజా రెడ్డి ఆధ్వర్యంలో  చేయించినట్లు గ్రామ సర్పంచ్ దండవేన సంధ్య బానేష్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంధ్య మాట్లాడుతూ గుంజపడుగు గ్రామంలో 8 మంది కార్మికులు ఉన్నారని, వీరు చేస్తున్న సేవలు మర్చిపోలేనిమన్నారు.

అలాగే గుంజపడుగు గ్రామ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్న ఎంపీడీవో శ్రీజా రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీజ రెడ్డి, ఎంపీఓ షబ్బీర్,  సర్పంచ్ సంధ్య బానేష్ లు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. రూ. 15 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ పొందిన వారిలో అయిలి రవి, చెవుల శ్రీనివాస్, కంటే గణేష్, చింతం మొండయ్య, దహగం శ్రీనివాస్, ప్రకాష్,రాజేష్, మల్లేష్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు.