చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి
01-06-2026 01:33 AM
జయశంకర్ భూపాలపల్లి, మే 31,(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా.కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన కట్ల సతీష్ (33) జీవనోపాధిలో భాగంగా గ్రామ శివారులోని బొక్కి చెరువులో చేపల వేటకు వెళ్లిన సతీష్ చెరువులో వేసిన వలకు కాలు చిక్కుకోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. నిరుపేద కుటుంబానికి చెందిన సతీష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.






