2 June, 2026 | 10:08 PM

యువకుడు అదృశ్యం

02-06-2026 08:59 PM

పిఎస్ లో ఫిర్యాదు చేసిన సోదరుడు

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కౌకూర్ లో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... కౌకూర్ పరిధిలోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఆకుల మురళీకృష్ణ (34) తన సోదరుడు ఆకుల కిరణ్ తో నివసిస్తున్నారు. ఈనెల 1వ తేదీన మురళీకృష్ణ తన కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న వేళ బయటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు మురళీకృష్ణ కోసం చుట్టుపక్కల వెతికిన తెలిసిన వార వద్ద వెతికిన బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు మురళీకృష్ణ సోదరుడు కిరణ్, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.