2 June, 2026 | 9:57 PM

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

02-06-2026 08:53 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టీకానంద్, జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ డిమాండ్ చేశారు. గత విద్యా సంవత్సరంలో సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలు, ఎస్టీ డిగ్రీ కళాశాల, బీసీ బాలికల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు.

ఆశ్రమ పాఠశాలల్లో తాగునీరు, ఫ్యాన్లు, దోమతెరలు, డార్మిటరీలు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు.జిల్లాలో ప్రభుత్వ భూములను కాపాడి గురుకులాలు, వసతి గృహాల భవనాల నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలోనే అన్ని విద్యాసంస్థలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు జాడి తిరుపతి పాల్గొన్నారు.