calender_icon.png 13 September, 2024 | 1:36 AM

గుండెపోటుతో యువసాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

08-08-2024 12:33:58 PM

గద్వాల (వనపర్తి ) (విజయక్రాంతి )/ అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కాశపురం గ్రామానికి చెందిన యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కరణం శ్రవణ్ కుమార్ (35) గుండెపోటుతో గురువారం బెంగళూరులో మరణించారు. ఉద్యోగ రీత్యా బెంగుళూరులో ఉంటున్న శ్రవణ్ కుమార్ కు భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడు కాశపురం గ్రామానికి చెందిన కర్ణం సుబ్రహ్మణ్యం ఏకైక కుమారుడు. చిన్న వయసులోనే గుండెపోటుతో శ్రవణ్ కుమార్ అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.