calender_icon.png 13 September, 2024 | 1:15 AM

పెద్దపల్లిలో నూతన తహసిల్దార్ కార్యాలయం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

08-08-2024 01:06:48 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి తహసిల్దార్ కార్యకలాపాలు ఇకనుంచి నూతన భవనంలో కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం  పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న నూతన భవనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రజల సౌకర్యార్థం ఇక నుంచి  తహసిల్దార్, జాయిన్ సబ్ రిజిస్టర్ సేవలు నూతన భవనం లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య, తహసిల్దార్ రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.