calender_icon.png 5 October, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతి ఆత్మహత్య

04-10-2025 05:13:35 PM

మేడిపల్లి (విజయక్రాంతి): యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట వాణి(54) కూతురు(21)తో కలిసి చెంగిచెర్లలో నివాసం ఉంటున్నారు. భర్త మురళీకృష్ణ ఐదు సంవత్సరాల క్రితం గుండె సంబంధిత సమస్యతో చనిపోయారు. అప్పటి నుంచి మాధురి డిప్రెషన్ లోకి వెళ్ళింది. మానసిక సమస్య కారణంగా బీటెక్ రెండవ సంవత్సరం మధ్యలో ఆపేసి ఇంటి వద్ద ఉంటుంది. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో బంజారాహిల్స్ లోని ఓ హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నారు. ఈనెల 2 తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని మాధురి చనిపోయిందని తల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.