జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం
25-02-2026 09:47 PM
పిఎస్ లో ఫిర్యాదు చేసిన తండ్రి
జవహర్ నగర్,(విజయక్రాంతి): యువతి అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజేఆర్ నగర్లో అడ్డుల నాగరాజు తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. ఈనెల 24వ తేదీన తన పెద్ద కుమార్తె అడ్డుల శ్రీవల్లి (19) ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శ్రీవల్లి ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఉంది. ఈ మేరకు ఆమె ఆచూకీ కోసం తెలిసిన చోట్ల వెతికినా బంధువుల వద్ద వెతికినా చుట్టుపక్కల వెతికినా ఆమె సమాచారం లభించలేదు. ఈ మేరకు తండ్రి నాగరాజు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




