2 August, 2026 | 1:56 PM

బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు

02-08-2026 12:54 PM

బోథ్, ఆగస్టు 2 (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని గుడిహత్నూర్ మండలానికి చెందిన బిజెపి నాయకులు ఆదివారం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సమక్షంలో ఆ పార్టీలో చేరారు. స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో వారంతా బి ఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

తాము కేటీఆర్ సమక్షంలోనే బి ఆర్ ఎస్ పార్టీలో చేరుదామని ఎమ్మెల్యేకు తెలపడంతో వారందరూ ఆదివారం ఉదయం హైదరాబాద్ తరలి వెళ్లారు. అక్కడ కేటీఆర్ సమక్షంలో పార్టీ గులాబి కండువాలను తప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల ను గెలిపించుకుని తీరుతామని హామీ ఇచ్చారు. కష్టపడ్డ వారికి భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామని కేటీఆర్ పార్టీలో చేరిన వారికి హామీ ఇచ్చారు.