2 August, 2026 | 2:15 PM

పబ్లిక్ స్కూల్ మంజూరి మండల వాసుల అదృష్టం

02-08-2026 01:04 PM

బోథ్, ఆగస్టు 2 (విజయక్రాంతి): నూతనంగా ఏర్పడ్డ సోనాల మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్(Telangana Public School ) మంజూరు కావడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గాజుల పోతన్న పేర్కొన్నారు. నిరుపేద గిరిజన ఆదివాసి విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఎంతోమంది మండలంలో విద్యనభ్యసిస్తున్నారు అన్నారు. అయితే పేద విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం గర్వకారణంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) జిల్లా ఇన్చార్జి మంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు ఎంతోమంది పబ్లిక్ స్కూల్ మంజూరు కోసం కృషి చేశారన్నారు. వారి కృషి ఫలితంగా పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం వల్ల నిరుపేద పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు లక్షల రూపాయలు వెచ్చించి పట్టణాలకు వెళ్లి చదువుకుంటున్న నిరుపేద కుటుంబాల వారికి ఈ పాఠశాల భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.