19-12-2025 06:13:31 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్,(విజయ క్రాంతి): ఈనెల 20 వ తేదీన (శనివారం) కలెక్టరేట్లో 'మీ డబ్బు మీ హక్కు' అనే అంశంపై ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు బ్యాంకుల్లో సంవత్సరాలుగా క్లెయిమ్ చేసుకోని డబ్బుకు సంబంధించి అవకాశం కల్పించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
బ్యాంకులలో పొదుపు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డివిడెంట్స్, బీమాలు క్లెయిమ్ చేసుకునేందుకు ఈ శిబిరం అవకాశం కల్పిస్తుందని అన్నారు. ద్వారా 10 సంవత్సరాలకు పైబడి బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకుని నిల్వ వివరాలు ఆర్బిఐ ఉద్గం వెబ్ సైట్ లో పొందవచ్చునని పేర్కొన్నారు. నిజమైన హక్కుదారులకు బ్యాంకుల్లోనే డబ్బులు పొందేందుకు ఈ శిబిరం ఆకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని అవసరమైన వారు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.