calender_icon.png 19 December, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏబీవీపీ సామూహిక వందేమాతరం

19-12-2025 06:15:16 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి):  వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఘట్ కేసర్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వందేమాతరం కార్యక్రమం విద్యార్థులతో కలిసి గురుకుల్ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి దాదాపు 1300 విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పూర్తి వందేమాతరం గీతం ఆలాపన చేశారు.

ముఖ్య వక్తగా విచ్చేసిన జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య నారాయణమూర్తి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి వందేమాతరం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యాసమితి సభ్యులు అంకం శ్యామ్ కిరణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి దేశ భక్తి అలవార్చుకొని వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. గురుకుల్ జూనియర్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ నారాయణ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాను, సచిన్, సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ ఉదయ్, గౌతమ్, హరి, రామకృష్ణ, ప్రవీణ్, బలరాం, అనిల్, మనోజ్, అనురాగ్, సాయిహర్ష కార్యకర్తలు పాల్గొన్నారు.