1 July, 2026 | 11:24 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నీ ఆర్‌ఎఫ్‌సీఎల్ కథ ముగిసిపోలే!

27-09-2024 01:12 AM

జనం ఛీ కొట్టినా మారవా

కోరుకంటి చందర్‌పై ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఫైర్

రామగుండం, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ‘ఖబడ్దార్ కోరుకంటి. నీ ఆర్‌ఎ ఫ్‌సీఎల్ కథ ముగిసిపోలేదు. మొన్నటి ఎన్నికల్లో జనం ఛీకొట్టినా ఇంకా మారవా?’ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై ప్రస్తుత ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. సింగరేణి కార్మికులను అవమానపరిచిన చందర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల పేరుతో సంపాదిం చిందంతా బయటకు తీసి బాధితులకు పంచేవరకు నిద్రపోనని హెచ్చరించారు.

సింగరేణి కార్మికులు చందాలు వేసుకొని గెలిపిస్తే కోరుకం టి చందర్ వారికి ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. సింగరేణి మెడికల్ కళాశాలకు రూ. 500 కోట్లు సింగరేణి కార్మికులు ఇస్తే.. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అందుకు కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలని స్పష్టంచేశారు. రామగుండం కమల్‌హాసన్‌గా పేరు ఎలా వచ్చిందో మర్చిపోయావా అంటూ ఎద్దేవా చేశారు.