calender_icon.png 27 January, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలిపిస్తే నిరుద్యోగుల గొంతుకనవుతా

27-09-2024 01:13:16 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి

నిజామాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే లక్షలాది మంది నిరుద్యోగ పట్టభద్రుల గొంతుకనై వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మట్లాడారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటు హక్కు నమోదుకు అవకాశం ఉందని, పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగిం చుకోవాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో తమ ప్రతినిధులు కేంద్రాలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంటారని, ఆసక్తి ఉన్న వారు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని చెప్పారు.