calender_icon.png 2 June, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో మీరు అందించిన సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం..

31-05-2025 08:29:48 PM

పదవి విరమణ పొందిన ఎస్ఐ మారుతి..

హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు..

సిరిసిల్ల (విజయక్రాంతి): 42 సంవత్సరాల విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని  పదవీ విరమణ పొందుతున్న వేములవాడ రూరల్ ఎస్.ఐ మారుతి(Rural SI Maruti), కొనరావుపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తు హెడ్ కానిస్టేబుల్ రాజమౌళిని శాలువా పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో మీరు అందించిన సేవలు భవిష్యత్ తారాల వారికి స్ఫూర్తిదాయకమని, ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు.

పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో  తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని  సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.ఎటువంటి అవసరం ఉన్న  పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ అధికారులు పాల్గొన్నారు.