6 July, 2026 | 5:15 PM

మోండా మార్కెట్​లో గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

09-08-2024 01:28 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ మోండా మార్కెట్​ లో శుక్రవారం గంజాయి పట్టుబడింది. రూ. లక్ష విలువైన కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి రైలు ద్వారా గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడో అక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంగంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపుతోంది.